ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. 3,200 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. యూనివర్సిటీల్లో 18 ఏళ్లుగా శాశ్వత ఉద్యోగాల భర్తీ జరగలేదన్న మంత్రి..యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీలలో ఖాళీగా ఉన్న 3200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఏపీపీఎస్సీ (APPSC) ద్వారా పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు.
మరోవైపు,రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం డీఎస్సికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన..డీఎస్సీ వివరాలు త్వరలోనే చెప్తామని బొత్స పేర్కొన్నారు.
ఇక, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని మంత్రి తెలిపారు. బైజుస్ తో చేసుకున్న ఒప్పందం లో ఎక్కడా ఆర్థికపరమైన అంశాలు లేవన్నారు. బైజూస్ సంస్థ ఉచితంగానే కంటెంట్ ఇస్తోందన్నారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా బైజూస్‌కి చెల్లించట్లేదని.. పిల్లలకు మంచి ఇంగ్లీష్ నేర్పడం కోసం టోఫెల్‌ను తీసుకొచ్చామన్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు టోఫెల్‌కి ఇచ్చేస్తున్నామని విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 5.18 లక్షల ట్యాబ్ లు 8 తరగతి విద్యార్దులకు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
24/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
12/10/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
27/09/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
20/09/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
12/10/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
25/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
11/10/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment