తెలంగాణలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం కొనసాగుతున్న అభ్యర్థుల పూర్వాపరాల పరిశీలన, వైద్య పరీక్షల నిర్వహణను ప్రస్తుతానికి నిలిపేశారు.
తెలంగాణలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం కొనసాగుతున్న అభ్యర్థుల పూర్వాపరాల పరిశీలన, వైద్య పరీక్షల నిర్వహణను ప్రస్తుతానికి నిలిపేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్లకు, ఎస్పీలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB)సూచన చేసింది. న్యాయస్థానం ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే శారీరక సామర్థ్య, రాత పరీక్షల్లో అర్హత సాధించడం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్వాపరాల పరిశీలనతోపాటు వైద్య పరీక్షలను నిర్వహించి శిక్షణకు పంపించేందుకు మండలి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ప్రశ్నపత్రంలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, తుది ఎంపిక సరిగా లేదని పలువురు అభ్యర్థులు కొద్దిరోజుల క్రితం కోర్టుని ఆశ్రయించారు. ఈ క్రమంలో అభ్యర్థులకు నాలుగు మార్కులను కలిపిన అనంతరం మరోసారి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెలువరించాలని అక్టోబరు మొదటి వారంలో కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే మార్కుల్ని కలిపే ప్రక్రియపై కసరత్తు చేయకుండా పూర్వాపరాల పరిశీలనతోపాటు వైద్యపరీక్షలనూ నిర్వహిస్తోందంటూ పిటిషనర్లు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ క్రమంలో మండలి అక్టోబరు 4న వెలువరించిన అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు గురువారం అక్టోబరు 19న ఆదేశించింది.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Update |
Item Name |
Details |
---|---|---|
17/10/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
12/10/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
25/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
11/10/2023 | ఫలితాలు | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment