టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. అక్టోబర్ 28న విజయవాడలో జాబ్ మేళా జరగనుంది.
ఉద్యోగం లేదని బాధపడే ఎంతో మంది యువతీ యువకులకు అద్భుత అవకాశం. 10th,ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకి ఉపాధి కల్పన కార్యాలయం స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ (Vijayawada) నగరంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా మెగా జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నారు.
ఉపాధి కల్పన కార్యాలయం స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణ ఎన్టీయర్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు అక్టోబర్ 28 వ తేదీ ‘అనగా గురువారం నాడు విజయవాడలోని ఫార్చ్యూన్ మురళీ హోటల్ సమీపంలోని పద్మజ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆవరణలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ జాబ్ మేళాలో వరుణ్ మారుతీ, పద్మజ సుజుకీ, వరుణ్ బజాజ్ వంటి కంపెనీల్లో సర్వీస్ అడ్వైసర్ అసిస్టెంట్ టెక్నిషియన్, సేల్స్ అడ్వైసర్ మరియు డెంటర్స్, పెంటర్ తదితర పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కావున జిల్లాలోని పదోవ తరగతి, ఐటీఐ, డిప్లొమా ఇన్ మెకానిక్స్ మరియు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 సంలు నుండి 27 సంవత్సరాల లోపు నిరుద్యోగులు పూర్తి బయోడేటా, ధృవపత్రాలు జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు తో నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాలని సూచించారు.
ఎంపికైన అభ్యర్ధులకు నెలకి 11000/ నుండి 15000/ వరకు వేతనం లభిస్తుంది అని తెలిపారు.
ఆసక్తి కలవారు ఎవరైనా వివరాలకు 814241 6211 నెంబర్ సంప్రందించ గలరని తెలిపారు.
No comments:
Post a Comment