ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపాల్, PGT, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) అండ్ ల్యాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 4062 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా EMRSలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేయడానికి EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ESSE) -2023 ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అయితే ఆన్ లైన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా.. జులై 31వ తేదీన ముగియనున్నాయి. ఇంకా దరఖాస్తులకు ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. EMRS ఖాళీల వివరాల్లోకి వెళ్తే.. ప్రిన్సిపాల్-303 పోస్టులు ఖాళీగా ఉండగా..అభ్యర్థుల యొక్క వయస్సు 50 సంవత్సరాలలోపు ఉండాలి. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులు 2,266 ఉండగా.. అభ్యర్థుల యొక్క వయస్సు 40 సంవత్సరాలలోపు ఉండాలి. నాన్ టీచింగ్ ఉద్యగాల్లో అకౌంటెంట్ విభాగంలో 361 పోస్టులు ఉండగా.. అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) ఉద్యోగాల 759 ఉండగా.. అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఇక ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు 373 పోస్టులుండగా.. అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి. జీతభత్యాలు.. ప్రిన్సిపాల్ - రూ. 78,800-రూ.2,09,200, పీజీటీ - రూ. 47600-151100, అకౌంటెంట్ - రూ. 35400-112400, JSA - రూ. 19900-63200, ల్యాబ్ అటెండెంట్ రూ. 18000-56900గా ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హతలు.. ప్రిన్సిపాల్ - గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అండ్ B.Ed.12 సంవత్సరాల అనుభవం ఉండాలి. PGT ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులలో విశ్వవిద్యాలయంగా పరిగణించబడే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అకౌంటెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి కామర్స్ డిగ్రీ చేసి ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) ఉద్యోగాల్లో అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సీనియర్ సెకండరీ (క్లాస్ XII) సర్టిఫికేట్ అండ్ ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషాలకు 35 పదాలు లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం కలిగి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు ల్యాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికేట్/డిప్లొమాతో 10వ తరగతి ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుంచి సైన్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఇక దరఖాస్తులకు జులై 31న చివరి తేదీగా పేర్కొన్నారు.
ముఖ్యమైన లింక్స్
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/07/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
23/07/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
23/07/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ | Get Details |
15/07/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |