తెలంగాణ రాష్ట్రంలోని పలు డిగ్రీ కాలేజీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో మొత్తం 2858 ఖళీలు ఉన్నాయి. వీటిలో కాంట్రాక్ట్ బేసిస్ మీద 527 మంది లెక్చరర్స్ 341 మంది ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంటర్లను హోనరేరియం కింద మరో 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు మొత్తం 1940 ఉన్నాయి. వీటిని ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే 2024, మార్చి 31తో ఈ కాల పరిమితి ముగియనుంది. మొత్తం పోస్టుల వివరాలిలా ఉన్నాయి. లెక్చరర్లు -527, టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంటర్లు – 50, గెస్ట్ ఫ్యాకల్టీ – 1,940, సీనియర్ అసిస్టెంట్ -29, డాటా ఎంట్రీ ఆపరేటర్ – 31, స్టోర్ కీపర్ – 40, జూనియర్ స్టెనో – 01, రికార్డు అసిస్టెంట్ – 38, మ్యూజియం కీపర్ -07, హెర్బేరియం కీపర్ -30, మెకానిక్ – 08, ఆఫీసు సబార్డినేట్ – 157. పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు.. నెట్ లేదా సెట్ క్వాలిఫై ఉండాలి. మరికొన్ని పోస్టులకు కేవలం డిగ్రీ అర్హతతో భర్తీ చేయనుండగా.. స్టోర్ కీపర్, జూనియర్ స్టెనో , మెకానిక్ , ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు పది, ఇంటర్ అర్హతగా ఉండనుంది.

No comments:
Post a Comment