గురుకులం పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు జూలై 24వ తేదీ నుంచి https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ వివరాలతో గురుకుల బోర్డు వెబ్‌సైట్లో లాగిన్ అయినప్పుడు దరఖాస్తు చేసిన సబ్జెక్టుల పోస్టుల హాల్‌టికెట్లు కనిపిస్తాయి. అక్కడ మీ హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 9,231 పోస్టులకు గాను 2.63 లక్షల మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క పోస్టుకు సగటున 29 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా.. జులై 24 నుంచి కూడా సైట్ ఓపెన్ కావడం లేదు. హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునేందుకు వెబ్సైట్ మొరాయిస్తోంది. దీంతో చాలామంది అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోలేక పోతున్నారు. అయితే హాల్ టికెట్స్ డౌన్ లోడ్లో ఏమైనా సమస్యలు ఏర్పడితే.. helpdesk-treib@telangana.gov.in. కు మెయిల్ చేయాలని లేదా (+91)-040-23317140 ను సంప్రదించాలని కోరారు. ఆగస్టు 1 నుంచి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో గురుకుల పరీక్షలను నిర్వహించాలని నియామక బోర్డు కార్యనిర్వాహక అధికారి నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు షిఫ్టులో ఈ పరీక్షలు ఉంటాయి. మొదటి షిఫ్టు పరీక్ష 8.30 నుంచి 10.30 గంటలు, రెండో షిఫ్టు పరీక్ష 12.30 నుంచి 2.30 గంటలు, మూడో షిఫ్టు పరీక్ష 4.30 నుంచి 6.30 గంటల వరకు ఉంటుంది. ఇదిలా ఉండగా ఆగస్టు 29, 30వ తేదీన గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందిే. గురుకుల పరీక్షలు జరిగిన వారంలోనే గ్రూప్ 2 పరీక్ష ఉండటంతో.. దీనిని వాయిదా వాయాలని అభ్యర్థులు అధికారులకు వినతి పత్రం సమర్పిస్తున్నారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.
ముఖ్యమైన లింక్స్
- హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment