నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ (NARFBR) 2023 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ సంస్థ కెరీర్ వృద్ధి, సాంకేతిక అభ్యాసానికి అత్యుత్తమ వాతావరణాన్ని అందిస్తుంది. NARFBRలో టెక్నికల్ అసిస్టెంట్ పాత్ర పరిశోధన పట్ల మక్కువ ఉన్నవారికి ఒక ప్రత్యేక అవకాశం. టెక్నికల్ అసిస్టెంట్‌లు పరిశోధన ప్రాజెక్ట్‌ల సజావుగా నడపడానికి కీలకమైనవి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 03, టెక్నీషియన్ - 1 పోస్టులు 08, ల్యాబ్ అటెండెంట్ - 1 పోస్టులు 35 ఉన్నాయి. వీటికి దరఖాస్తుల ప్రక్రియ జులై 05 తేదీ నుంచి ప్రారభం అయింది. ఆగస్టు 14వ తేదీన ముగియనుంది.
టెక్నికల్ అసిస్టెంట్
- మొత్తం పోస్టులు 03 ఉన్నాయి. అభ్యర్థుల యొక్క వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. గ్రాడ్యుయేషన్ తో పాటు.. రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
టెక్నీషియన్ - 1
- పోస్టులు 08 ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థుల యొక్క వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. 55 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు.. సంబంధిత పనిలో అనుభవం ఉండాలిని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ల్యాబ్ టెక్నీషియన్ -01
- కేటగిరీ కింద పోస్టులు 35 ఖాళీగా ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీ కింద 13, ఎస్సీ కింద 04, ఎస్టీ కింద 01, ఓబీసీ 09... ఇతర కేటగిరీల కింద 08 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల యొక్క వయస్స 25 ఏళ్లకు మించకూడదు. 50 శాతం మార్కులతో 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పనిలో ఒక సంవత్సరం పని అనుభవం కూడా ఉండాలి.
జీతాలు..
- NARFBRలో టెక్నికల్ అసిస్టెంట్ స్థానానికి సంబంధించిన పే స్కేల్ 7వ పే మ్యాట్రిక్స్ స్థాయి 06 కిందకు వస్తుంది. ఇది రూ. 35,400 నుండి రూ. 1,12,400 వరకు ఉంటుంది. ఇది రూ. 4200 గ్రేడ్ పేతో రూ. 9300-రూ. 34800 పాత పే బ్యాండ్‌కు అనుగుణంగా ఉంటుంది. ఈ జీతం శ్రేణి సంస్థలోని పాత్ర యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. కీలక పరిశోధన పనికి సాంకేతిక సహాయకుల సహకారాన్ని గుర్తిస్తుంది. ఇది ఎంచుకున్న అభ్యర్థులకు తగిన విధంగా పరిహారం అందజేసి.. ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చేస్తుంది.
- టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు చెల్లిస్తారు.
- టెక్నీషియన్ పోస్టులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 మధ్య చెల్లిస్తారు.
- ల్యాబ్ టెక్నీషియన్ -1 ఉద్యోగాలకు నెలకు రూ.18,000 నుంచి రూ. 56,900 మధ్య చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం..
- అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. రూ.300 డిమాండ్ డ్రాఫ్ట్ తో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్లను జత చేసి డైరెక్టర్, ICMR – నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ బయోమెడికల్ రీసెర్చ్, జీనోమ్ వ్యాలీ, కొల్తూర్ (P.O), షామీర్‌పేట్ (M), హైదరాబాద్ , తెలంగాణ - 500 101 అడ్రస్ కు పంపించాలి.
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment