ఆంధ్రప్రదేవ్ హైకోర్టు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లా క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 26 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులను పూర్తిగా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారు. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా వివిధ రకాల విద్యార్హత సర్టిఫికేట్లతో పాటు.. లా డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను జత చేసి పోస్ట్ ద్వారా దరఖాస్తులను పంపించాలి. ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు పూర్తి చేసి ఉండాలి. లేదా మూడేళ్ల లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నాటి కంటే రెండేళ్ల ముందు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇతర బార్ కౌన్సిల్‌లలో అడ్వకెట్‌గా ఎన్‌రోల్ చేసుకుని ఉండకూడదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసే అభ్యర్థుల యొక్క వయోపరిమితి 30 ఏళ్లకు మించకూడదు. రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జులై 22, 2023. ఎంపికైన వారికి నెలకు రూ.35,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సిన చిరునామా రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్), హై కోర్ట్ ఆఫ్ అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 522238. పూర్తి వివరాలకు https://aphc.gov.in/ వెబ్ సైట్ సందర్శించవచ్చు.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment