పదిలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. తెలంగాణలో 51 పోస్టులకు.. ఏపీలో 56 పోస్టులకు సెకండ్ లిస్ట్ విడుదల చేయగా.. వీరు ఆగస్టు 06వ తేదీలోగా సర్టిఫికేట్లతో డివిజనల్ పోస్ట్ ఆఫీస్ లో వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇటు.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. అటు కేంద్రం నుంచి కూడా ఎన్నో రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. వీటిలో కొన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తుల ప్రక్రియ ముగియగా..మరికొన్నింటికి కొనసాగుతున్నాయి. తాజాగా పోస్టల్ డిపార్ట్ టెంట్ నుంచి ఇటీవల భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మొదట జీడీఎస్ 40 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాగా.. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ల లిస్ట్ లను 5 విడుదల చేశారు. ఈ పోస్టులకు కేవలం పదో తరగతి అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి రాత పరీక్షలు ఉండవు. పదో తరగతిలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇదిలా ఉండగా.. ఇటీవల 12 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషల్ జీడీఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 బీపీఎం అండ్ 7,082 ఏబీపీఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. మే 22 నుంచి వీటికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 11, 2023 తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తులును స్వీకరించారు. దరఖాస్తులో ఎడిట్ కు జూన్ 12 నుంచి జూన్ 14వ తేదీ వరకు ఈ అవకాశం కల్పించారు. అయితే జూన్ నెల చివరి వారంలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేశారు. ఈ లిస్ట్ లో పేరు ఉన్న అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే చాలా మంది గౌర్హాజరు అవ్వడంతో.. ఇటీవల మరో లిస్ట్ విడుదల చేశారు. పదిలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. తెలంగాణలో 51 పోస్టులకు.. ఏపీలో 56 పోస్టులకు సెకండ్ లిస్ట్ విడుదల చేయగా.. వీరు ఆగస్టు 06వ తేదీలోగా సర్టిఫికేట్లతో డివిజనల్ పోస్ట్ ఆఫీస్ లో వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక వేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాకపోతే.. వారి పోస్ట్ తర్వాత మెరిట్ లో ఉన్నవాళ్లకు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.

No comments:
Post a Comment