Mother Tongue

Read it Mother Tongue

Saturday, 26 October 2024

పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ.. APSRTC భారీ గుడ్ న్యూస్.. అందరికీ అవకాశం..

 ఏపీలోని టీడీపీ ప్రభుత్వం వరుసపెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా సంక్షేమంతో పాటు నిరుద్యోగ సమస్యపై కూడా కసరత్తులు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ కీలక అప్ డేట్ బయటకొచ్చింది.

ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటించిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. నిరుద్యోగులకు అతి త్వరలో మరో శుభవార్త చెప్పబోతోందట. APSRTCలోని ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందట. ఈ మేరకు కసరత్తులు షురూ చేశారట.

ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మొత్తం 18 విభాగాల్లో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఖాళీలను గుర్తించారు. ఈ ఖాళీల వివరాలను ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది.

టోటల్ గా చూస్తే 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్టీసీ తెలిపింది. వీటిలో 3,673 రెగ్యులర్ డ్రైవర్ పోస్టులు, 1,813 కండక్టర్ పోస్టులు, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్, 579 అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ ఉద్యోగాలు, 207 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీలు, 179 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం.

ఈ ఖాళీల భర్తీపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. APSRTCలో ఒకేసారి పెద్దత్తున ఉద్యోగాల నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందట.

మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల కోసం నవంబర్ తొలి వారంలోనే మెగా డీఎస్సీ ప్రకటించనుందట ఏపీ ప్రభుత్వం. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారట.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials