నవంబర్ 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్ 3 పరీక్షల కొరకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు జరగాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మహేందర్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం హైదరాబాద్ నుండి గ్రూప్ 2, 3 పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3.. డిసెంబర్ 15న గ్రూప్ 2 పరీక్ష కొరకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు జరగాలని ఆయన పేర్కొన్నారు.
స్ట్రాంగ్ రూమ్ కొరకు జిల్లాలోని ట్రెజరీ, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లనో అనువైన కేంద్రాలను గుర్తించాలని, అదేవిధంగా పరీక్షా కేంద్రాలను పరీక్షించి అక్కడి పరిస్థితులను గురించి నివేదిక అందించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి మాట్లాడుతూ, జిల్లాలో గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు 13500 మంది అభ్యర్థుల కొరకు 37 కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్‌ను కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో గ్రూప్ 3, గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట ఏసీపీ మధు, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్ ఇతర అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment