ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించడం కోసం ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధి కల్పన నోడల్ అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం జిల్లా ఉపాధి కార్యాలయంలో అనేక జాబ్ మేళాలు నిర్వహించినట్లు చెప్పారు. కొన్ని వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఎంపికై ఉపాధి పొందుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి కల్పించడం కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్ ఫైనాన్స్ ఇన్క్లూజన్ లిమిటెడ్ కంపెనీ ఈ జాబ్ మేళాలో పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఖాళీగా ఉన్న 50 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇంటర్ మరియు డిగ్రీ చదివిన అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. ఇందులో మొత్తం 50 లోన్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. 18 నుంచి 28 సంవత్సరాల గల నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు.
అభ్యర్థులకు ద్విచక్ర వాహనం మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాంచీలలో పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో ఎంపికైన వారికి రూ.14,575 నెలసరి వేతనం ఉంటుంది.
ఆసక్తి, అర్హత కలిగిన యువతీ, యువకులు తమ విద్యా అర్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు, పాస్ ఫోటోలతో ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ములుగు రోడ్డులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలి.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి వివరాలకు 7893394393 నెంబర్ ను సంప్రదించాలన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
No comments:
Post a Comment