ఈ మధ్య కాలంలో వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకాలకు వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు నిరుద్యోగులకు మరో సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC), తాజాగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఇంజనీరింగ్ చదివిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు పరిశీలిద్దాం.
లేటెస్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సూపర్‌వైజర్ (S&T), అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (ASE), జూనియర్ ఇంజనీర్ (JE), సెక్షన్ ఇంజనీర్ (SE), సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (SSE) వంటి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు సంస్థ అధికారిక వెబ్‌సైట్ delhimetrorail.comలో అప్లికేషన్స్ సమర్పించవచ్చు. ఇందుకు నవంబర్ 8 వరకు గడువు ఉంది.
* వయోపరిమితి
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు పోస్టును బట్టి గరిష్టంగా 55 లేదా 62 ఏళ్ల వరకు ఉండాలి.
* అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, IT లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా చదివి ఉండాలి. ఈ కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులు లేదా అదే స్థాయిలో CGPA సాధించాలి.
* అప్లికేషన్ ప్రాసెస్
అధికారిక పోర్టల్‌లో డీఎంఆర్‌సీ అప్లికేషర్ ఫారమ్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి పూర్తి వివరాలు నింపాలి. దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ యాడ్ చేసి, నవంబర్ 8లోపు స్పీడ్ పోస్ట్ ద్వారా ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (HR), ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, మెట్రో భవన్, ఫైర్ బ్రిగేడ్ లేన్, బరాఖంబా రోడ్, న్యూఢిల్లీ - 110001’ అడ్రస్‌కు పంపించాలి. లేదా పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ స్కాన్డ్ కాపీని career@dmrc.org అనే అధికారిక ఐడీకి ఇమెయిల్ చేయాలి.
* ఎలా ఎంపిక చేస్తారు?
ఈ పోస్టులకు ఎలాంటి రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఉండదు. అర్హతలకు అనుగుణంగా ఉన్న ఫారమ్స్ షార్ట్ లిస్ట్ చేసి, వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీంట్లో క్వాలిఫై అయిన వారికి షార్ట్ మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది. రెండింట్లో సక్సెస్ అయిన వారిని మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
* జీతం ఎంత?
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రిక్రూట్‌మెంట్ 2024కి ఎంపికైన అభ్యర్థులకు జాబ్ రోల్‌ను బట్టి నెల జీతం రూ.50,000 నుండి రూ. 72,600 వరకు ఉంటుంది. కాంపెన్సేషన్ ప్యాకేజీలో ట్రావెలింగ్ అలవెన్స్‌లు, మెడికల్ కవరేజ్, ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
అయితే పోస్టుల డిప్యుటేషన్ పరంగా చూస్తే.. జూనియర్ ఇంజనీర్ (డిప్యుటేషన్ బేసిస్)కు రూ. 35,400 నుంచి రూ. 1,12,400; సెక్షన్ ఇంజనీర్ (డిప్యూటేషన్ బేసిస్)కు రూ. 44,900 నుంచి రూ. 1,42,400; సూపర్‌వైజర్ (JE/ASE/SE/SSE) (రిటైర్మెంట్ తర్వాత కాంట్రాక్టు పోస్టు)కు రూ. 44900 నుంచి రూ. 142400 వరకు జీతం లభిస్తుంది.
No comments:
Post a Comment