కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 117 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ మొత్తం పోస్టుల్లో 47 ట్రైనీ ఇంజినీర్, 70 ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, బీఈ/ బీటెక్/ బీఎస్సీ, గేట్-2024 స్కోరుతో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీ లోగా ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులకు గాను సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,000 వేతనం ఇస్తారు.
ట్రైనీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు గాను సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 వేతనం ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.powergrid.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
No comments:
Post a Comment