ఏపీలో సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న టైప్-3 కేజీబీవీల్లో 547, టైప్-4 కేజీబీవీల్లో182 పోస్టులు భర్తీ చేయనున్నారు. టైప్-3లో హెడ్ కుక్ 48, సహాయ వంటమనిషి పోస్టులు 263, వాచ్ ఉమెన్ 95, స్కావెంజర్ 79, స్వీపర్ 62 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా టైప్-4లో హెడ్‌కుక్ 48, సహాయ వంటమనిషి 76, చౌకీదార్ 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబరు 7వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం (MEO)లో అందజేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్వీకరించిన దరఖాస్తులను 17వ తేదీన జిల్లా కార్యాలయానికి పంపిస్తారు. అక్టోబర్ 18వ తేదీన తుది జాబితా సిద్ధం చేసి.. అక్టోబర్ 22వ తేదీన మెరిట్ జాబితా విడుదల చేస్తారు. ఫైనల్ గా ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీన ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment