కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)లో అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఓఎన్‌జీసీ సెక్టార్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేయబోతున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 2, 236 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్.
ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రీషియన్, సివిల్ ఎగ్జీక్యూటీవ్, ఆఫీస్ అసిస్టెంట్, పెట్రోలియం ఎగ్జీక్యూటివ్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ఫిట్టర్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్, స్టోర్ కీపర్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, సర్వేయర్, వెల్డర్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ తదితర ఖాళీలు ఉన్నాయి. విభాగాన్ని బట్టి 10వ తరగతి, 12వ తరగతి పాసై సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లై చేసే అభ్యర్థుల వయసు 25-10-2024 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 25 వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత అర్హత పరీక్ష ఉంటుంది. ఇందులో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8,050, ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.7,000-రూ.8,050 చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్ సైట్ https://ongcindia.com/ చూడండి.
No comments:
Post a Comment