ప్రభుత్వ శాఖల్లో వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నాయి. తాజాగా మెడికల్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కు మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (NDMC), ఇటీవల భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. సంస్థ పరిధిలోని వివిధ విభాగాల్లో ముఖ్యమైన పోస్టులను భర్తీ చేస్తోంది. వీటికి ఎలాంటి రాతపరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. సెలక్ట్ అయిన వారికి నెలకు రూ.60 వేలకు పైగా జీతం లభిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు
వైద్య సేవల విభాగంలో సీనియర్ రెసిడెంట్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు NDMC నోటిఫికేషన్ విడుదల చేసింది. సంస్థ మొత్తంగా 12 ఖాళీలను భర్తీ చేయనుంది. గైనకాలజీ, ఆఫ్తల్మాలజీ, సర్జరీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, రేడియాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
ఏజ్ లిమిట్
సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 45 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
అర్హతలు
అభ్యర్థులు కచ్చితంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కళాశాలల్లో ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో MD/MS/NDB/Diploma ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు. అదనంగా, సంబంధిత విభాగంలో కనీసం 3 ఏళ్ల పాటు పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ వైద్యశాలల్లో సీనియర్ రెసిడెన్సీ చేస్తున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అనర్హులు.
సెలక్షన్ ప్రాసెస్
అర్హత ఉన్న అభ్యర్థులు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం అప్లికేషన్స్ పరిశీలించి, అర్హతలు ఉన్నవారికి వాక్ ఇన్ ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష ఉండదు, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన వారిని పోస్టులకు నేరుగా ఎంపిక చేస్తారు.
వేతనం, పదవీ కాలం
ఎంపికైన అభ్యర్థులకు 7వ పే కమిషన్ ప్రకారం లెవెల్ 11 కింద నెలకు రూ.67,700 వేతనం లభిస్తుంది. నాన్ ప్రాక్టిసింగ్ అలవెన్సు(NPA)తో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇందులోనే వర్తిస్తాయి. ఇక, ఎంపికైన సీనియర్ రెసిడెంట్‌లు ఏడాది పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థుల పనితీరుని బట్టి పదవీ కాలం మూడేళ్లకు పొడిగించే అవకాశం ఉంది.
అప్లికేషన్ తుది గడువు
ఇప్పటికే ఈ ఉద్యోగానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. నేటితో(అక్టోబర్ 3) అప్లికేషన్ గడువు ముగియనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే సంస్థ అధికారిక వెబ్‌సైట్ nmdc.gov.in లోకి వెళ్లి అప్లై చేయవచ్చు.
No comments:
Post a Comment