దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థలుగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)లకు గుర్తింపు ఉంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఐఐటీలు ఉన్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉద్యోగం వస్తే, లైఫ్ సెటిల్ అయినట్లే. అయితే తాజాగా IIT జమ్మూ వివిధ విభాగాల్లో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 12న ప్రారంభం కాగా, నవంబర్ 2 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
* ఖాళీలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో లాబొరేటరీ అసిస్టెంట్, రిజిస్ట్రార్, అసిస్టెంట్ వర్క్‌షాప్ ఆఫీసర్ పోస్టుల్లో మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. రిజిస్ట్రార్, అసిస్టెంట్ వర్క్‌షాప్ ఆఫీసర్ జాబ్ రోల్స్‌కు ఒక్కో ఖాళీ ఉన్నాయి. లేబొరేటరీ అసిస్టెంట్‌గా తొమ్మిది మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
* అర్హతలు
రిజిస్ట్రార్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60% మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్‌లో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి. అందులో 8 ఏళ్లు డిప్యూటీ రిజిస్ట్రార్‌గా లేదా అలాంటి జాబ్ రోల్ ఉండాలి. అసిస్టెంట్ వర్క్‌షాప్ ఆఫీసర్ ఉద్యోగానికి మెకానికల్/మాన్యుఫ్యాక్చరింగ్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో M.Tech లేదా B.Tech చదివి ఉండాలి. అలాగే ఈ పోస్టులో పని చేసిన అనుభవం ఉండాలి.
లేబొరేటరీ అసిస్టెంట్ పోస్టుకు ఇంజనీరింగ్ లేదా సైన్స్‌లో మాస్టర్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. ఇంజినీరింగ్‌లో డిప్లొమా, అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రార్ పోస్టుకు 57 ఏళ్లు, అసిస్టెంట్ వర్క్‌షాప్ ఆఫీసర్ పోస్టుకు 45 ఏళ్లు, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు 33 ఏళ్ల లోపు వయసు ఉండాలి.
* అప్లికేషన్ ప్రాసెస్
- అధికారిక వెబ్‌సైట్ https://www.iitjammu.ac.in/ ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలో కనిపించే ‘IIT జమ్మూ రిక్రూట్‌మెంట్ 2024’ లింక్‌పై క్లిక్ చేయండి.
- ఇక్కడ అడిగిన వివరాలను నింపి, అప్లికేషన్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ఫారమ్ ప్రింట్ తీసుకోండి.
* అప్లికేషన్ ఫీజు
రిజిస్ట్రార్ పోస్టుకు రూ.1000 (800 అప్లికేషన్ ఫీజు + 200 ప్రాసెసింగ్ ఫీజు), మిగతా పోస్టులకు రూ. 500 (300 అప్లికేషన్ ఫీజు + 200 ప్రాసెసింగ్ ఫీజు) చెల్లించాలి. అయితే SC/ST, PwD, మహిళా అభ్యర్థులు రూ. 200 ప్రాసెసింగ్ ఫీజు పే చేస్తే సరిపోతుంది.
* సెలక్షన్ ప్రాసెస్
అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి, మంచి ప్రతిభ కనబర్చిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
* జీతం ఎంత?
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 7వ CPC పే లెవల్ ప్రకారం జీతం అందుకుంటారు. రిజిస్ట్రార్ లెవల్ పోస్టుకు జీతం రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు ఉంటుంది. అసిస్టెంట్ వర్క్‌షాప్ ఆఫీసర్స్‌కు రూ.56,100-రూ.1,77,500; లేబొరేటరీ అసిస్టెంట్స్‌కు రూ.29,200-రూ.92,300 జీతం లభిస్తుంది.
No comments:
Post a Comment