మీరు కొత్తగా ఏమైనా చేయాలని అనుకుంటున్నారా.. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఉపాధి కూడా పొందాలని అనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
అదిరిపోయే అవకాశం అందుబాటులో ఉంది. గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(జీఎస్‌డీపీ)లో గచ్చిబౌలిలోని ఈపీటీఆర్‌ఐ తాజాగా సర్టిఫికెట్ కోర్సులను తీసుకు వచ్చింది. మీరు ఈ కోర్సు చేస్తే.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కూడా పొందొచ్చు.
వేస్ట్ ఆప్టిమైజేషన్ ప్రొఫెషనల్ కోర్సుకు సంబంధించి 3 నెలలు ఉచిత శిక్షణ ఉంటుంది. అప్లై చేసుకోవచ్చు. అర్హులైనవారికి ఉచిత వసతి కల్పిస్తారు. ఇంకా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వర్క్ ఉంటుంది. తర్వాత సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
ఈ సర్టిఫికెట్ ద్వారా రీసైక్లింగ్ కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. ఇకపోతే స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ గ్రీన్ స్కిల్ ఇండియా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ఈ కోర్సులో శిక్షణ పొందిన వారికి పరిశ్రమలు, రీసైక్లింగ్ కేంద్రాలు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఉద్యోగాలు పొందొచ్చు. కాగా నవంబరు రెండో వారంలో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని గుర్తు పెట్టుకోవాలి.
కాగా మీరు ఈ ఉచిత శిక్షణ కోసం అప్లై చేసుకవాలని భావిస్తే.. అక్టోబరు 31 వరకే గడువు ఉంటుంది. అర్హతలను గమనిస్తే.. ఇంటర్, డిగ్రీ, బీటెక్‌తో పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారు అర్హులు.
అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి శిక్షణ ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు https://forms.gle/C2KPyb42N1XGUrb69 గూగుల్ ఫారమ్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
No comments:
Post a Comment