కేజీబీవీలో పలు రకాల పోస్టులు భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సువర్ణావకాశం మహిళలకు మాత్రమే. జాబ్ వస్తే చాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జాబ్ చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని కేజీబీవీ (కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ)ల్లో ఖాళీగా ఉన్న 15 బోధనేతర పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 2024 అక్టోబర్ 7 తేదీ నాటికి ఓసీ మహిళా అభ్యర్థులకు (42 సంవత్సరాల లోపు), ఎక్స్ సర్వీస్ మహిళా అభ్యర్థులకు 45 సంవత్సరాల లోపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు 47 సంవత్సరాల లోపు, పీహెచ్సీ మహిళా అభ్యర్థులకు 52 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలన్నారు.
నైట్ వాచ్మెన్, చౌకీదార్ పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణత.. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్లకు విద్యార్హత తప్పనిసరి కాదని తెలిపారు. ఈ పోస్టులు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా అర్హులు అయి ఉంటే దరఖాస్తు చేసుకోండి హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment