నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఒడిషా పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నాన్-లోకల్ కేటగిరీలో ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒడిషా ఇన్ఫర్మేషన్ సర్వీస్ కేడర్‌లో గ్రూప్-B పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ www.opsc.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 30 లోపు అప్లై చేసుకోవచ్చు.
* అర్హత ప్రమాణాలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 39 పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసే అభ్యర్థి జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్‌లో ఏడాది పాటు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్, అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి. కాగా, ఈ పోస్టులకు ఒడిషా రాష్ట్రానికి చెందిన అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ నాన్ లోకల్ కోటా కింద కేవలం 5 శాతం పోస్టులే కేటాయిస్తారు.
* వయో పరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు తప్పనిసరిగా 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 2024 జనవరి 1వ తేదీ నాటికి 38 సంవత్సరాలకు మించకూడదు. అంటే 1986 జనవరి 2 నుండి 2003 జనవరి 1 మధ్య కాలంలో జన్మించిన అభ్యర్థులే దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, మాజీ సైనికులకు ఐదేళ్ల పాటు గరిష్ట వయో సడలింపు ఉంటుంది. 40% లేదా అంతకంటే ఎక్కువ శాశ్వత వైకల్యం గల వికలాంగ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వర్గాలకు చెందిన వికలాంగ అభ్యర్థులకు 15 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.opsc.gov.in ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీ మెనులో ఉన్న “సైన్ అప్” లేదా “రిజిస్టర్” ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
- మీ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీ వివరాలను ఎంటర్ చేయండి. పాస్‌వర్డ్ సెట్ చేసుకొని లాగిన్ అవ్వండి.
- మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటి వివరాలను నింపి, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించండి. ఇందుకు మొబైల్ లేదా ఈ-మెయిల్‌కు వచ్చే వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయండి.
- నిబంధనలు, షరతులను చదవండి. వాటిని అంగీకరిస్తున్నట్లు టిక్ మార్క్‌కొట్టండి. తర్వాత మెనులో “సబ్‌మిట్” లేదా “రిజిస్టర్” ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
- మీ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి వచ్చిన లింక్ ద్వారా మీ అకౌంట్‌ను యాక్టివేట్ చేయండి.
- మీరు దరఖాస్తు చేయాలనుకున్న పోస్టుపై క్లిక్ చేసి అన్ని వివరాలు అందించండి. ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్‌మిట్ చేయండి.
* సెలక్షన్ ప్రాసెస్
OPSC SDIPRO రిక్రూట్‌మెంట్ 2024 సెలక్షన్ ప్రాసెస్‌లో ముందు రాత పరీక్ష (400 మార్కులు) నిర్వహిస్తారు. దీంట్లో టాప్ పొజిషన్‌లో ఉన్నవారికి వైవా వోస్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ (30 మార్కులు) ఉంటుంది. సెలక్ట్ అయిన వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత పోస్టింగ్ ఇస్తారు. ఎగ్జామ్ డేట్స్ గురించి త్వరలో ప్రకటన రావచ్చు. మరిన్ని వివరాల కోసం OPSC అధికారిక వెబ్‌సైట్ ఫాలో అవ్వండి.
* జీత భత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ. 44,900 నుండి రూ.1,42,400 మధ్య బేసిక్ పేస్కేల్‌పై జీతం లభిస్తుంది. బేసిక్ పేతో పాటు హెచ్‌ఆర్‌ఏ, పీఎఫ్ వంటి ఇతర అలవెన్సులు ఉంటాయి. ORSP రూల్స్ 2017 ప్రకారం పే మ్యాట్రిక్స్ లెవెల్ 10 కింద వీరికి వేతనాలు లభిస్తాయి.
No comments:
Post a Comment