Mother Tongue

Read it Mother Tongue

Thursday, 2 November 2023

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు జాబ్ మేళా, రూ.25 వేల జీతం పొందొచ్చు!

ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే ఏపీ.ఎస్.ఎస్.డి.సి డాట్ యువత స్కిల్ యూనివర్సిటీ ఇన్ వెబ్సైట్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరుకావాలని జిల్లా అధికారి చైతన్య తెలిపారు.

విశాఖపట్నం కంచరపాలెంలో ఉన్న గవర్నమెంట్ ఐటిఐ నందు ఈ నెల (నవంబర్) 3వ తేదీన జాబ్ మేళా నిర్వహించున్నామని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి సాయి కృష్ణ చైతన్య, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. 3వ తేదీ ఉదయం 9.30 గంటలకు 200 పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ప్రకటనలో స్పష్టం చేశారు.

ఈ జాబ్ మేళా లో టెక్విస్సేన్ సాఫ్ట్వేర్, డాక్టర్ రెడ్డీస్ లేబరోటరీస్, యోకోహమా టైర్స్, రావోల్స్ ఇండస్ట్రీస్, ఎస్.ఆర్. షాపింగ్ మాల్ పాల్గొని ఇంటర్వ్యూలు చేస్తాయని తెలిపారు. టెక్విస్సేన్ సాఫ్ట్వేర్లో ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత అయిన 25 సంవత్సరాల లోపు ఉన్న యువతీ యువకులు హాజరుకావొచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం గంభీరంలో వర్క్ లొకేషన్ ఉంటుందని, నెలకు రూ.16000 నుండి రూ. 20000 వరకు జీతం ఉంటుందని తెలిపారు. అలాగే డాక్టర్ రెడ్డీస్ లేబరోటరీస్ లో డిప్లొమా లేదా బీటెక్ లో ఎలక్ట్రిక్రల్, మెకానికల్, ఇన్సుమెంటేషన్, కెమికల్ మరియు ఎంఎస్సిమైక్రో బయాలజీ లేదా బయో టెక్నాలజీ లలో 2022 మరియు 2023 అకాడమిక్ సంవత్సరంలో ఉత్తీర్ణత అయి ఎటువంటి ఎడ్యుకేషనల్ గ్యాప్స్ లేకుండా పదవతరగతి నుండి కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత అయిన యువతీ యువకులు హాజరుకావొచ్చని తెలిపారు.

ఈ కంపెనీలో ఎంపిక అయిన అభ్యర్థులు పైడిబీమవరం లేదా బాచుపల్లిలో వర్క్ లొకేషన్ ఉంటుందని, నెలకు రూ.16000 నుండి రూ. 25000 వరుకు జీతం ఉంటుందని తెలిపారు. యోకోహోమా టైర్స్ కి సంబంధించి 2019 - 2024 ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత అయిన యువతులు మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. ఎంపిక అయిన యువతులు ఏపీ సెజ్ అచ్చుతాపురంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని, టైనింగ్ తరువాత నెలకు రూ.15000 వరుకు జీతం ఉంటుందని తెలిపారు.

రాల్లివోల్ఫ్ ఇండస్ట్రీస్ లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లో పాసైన యువకులు అర్హులు. వీరంతా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, తిరుపతి, కాకినాడ, హైదరాబాద్ లొకేషన్ లలో ఉద్యోగం చెయ్యాల్సి వుంటుందని నెలకు రూ. 16000నుండి రూ 18000 వరుకు జీతం ఉంటుందని మరియు ఇతర అలవెన్సుస్ ఉంటాయని తెలిపారు. ఎస్.ఆర్. షాపింగ్ మాల్ వేరేహౌజ్ లో పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, ఏదైనా డిగ్రీలో పాస్ అయిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. కంపెనీలో ఎంపిక అయిన అభ్యర్థులు విశాఖపట్నం మాధవదారలో ఉన్న వేరేహౌజ్ లో వర్క్ చెయ్యాల్సి వుంటుందని నెలకు రూ.8000 నుండి రూ 15000 వరుకు జీతం వుంటుంది అని తెలిపారు.

ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే ఏపీ.ఎస్.ఎస్.డి.సి డాట్ యువత స్కిల్ యూనివర్సిటీ ఇన్ వెబ్సైట్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరుకావాలని జిల్లా అధికారి చైతన్య తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా ప్లేసెమెంట్ అనుబంధ అధికారి రమేష్ నాయుడు 9292553352 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని జిల్లా మేనేజర్ సాయికృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అర్హులైన నిరుద్యోగ యువతులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials