ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం..నిరుద్యోగ యువతలో వృత్తి నైపుణ్యాన్నిపెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలే ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 3వ తేదీన.. మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు.
ఈ మెగా జాబ్ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు తమ కంపినిలలో ఉద్యోగస్థులను ఎంపిక చేసుకునేందుకి పాల్గొనున్నాయి. CTEC PVT లిమిటెడ్,అస్త్రో స్టీల్స్,NS ఇన్స్ట్రుమెంట్స్,మిథుబాషా, అమర్ రాజా బ్యాటరిస్ వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి.దీనికోసం పదవ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, డిప్లమో, బీటెక్, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు.
03-11-2023 వ తేదీ ఉదయం 09:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది.ఈ ఉద్యోగం మేళాకు సంబంధించి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఇది ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా ఉపాధికల్పనా అధికారులు తెలిపారు.ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి 18 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
అదే విధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మరిన్ని వివరాలకు
- S. Saiteja (Placement Executive ) - 8309283980
- Rajasekhar (Skill Hub Coordinator) - 9177413642
- V Sreenivasulu (Dedicated ESC Coordinator) - 9703993995
No comments:
Post a Comment