Mother Tongue

Read it Mother Tongue

Monday, 27 February 2023

పది అర్హత.. 1284 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రహోం మంత్రిత్వశాఖలో భాగంగా ఉండే ఈ విభాగంలో భారీగా పోస్టునుల భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1284 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1220 పురుషులకు , 64 మహిళలకు కేటాయించారు. కోబ్లర్, టైలర్, వాషర్‌మన్, బార్బర్, స్వీపర్, కుక్‌, వెయిటర్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి యొక్క వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం https://rectt.bsf.gov.in/ ఈ లింక్ ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 27, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 

2 comments:

Job Alerts and Study Materials