10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ బంపర్ జాబ్స్ నోటిఫికేషన్(Notification) వెల్లడించింది. ఆర్మీ హెచ్‌క్యూ 22 కింద గ్రూప్ సిలో 135 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అభ్యర్థులు మార్చి 3 వరకు ఆఫ్‌లైన్‌లో(Offline) దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు -135 పోస్టులు
MTS (సఫాయివాలా) - 28 పోస్టులు
MTS (మెసెంజర్) - 3 పోస్టులు
మెస్ వెయిటర్ - 22 పోస్టులు
బార్బర్ - 9 పోస్టులు
మసల్చి - 11 పోస్టులు
కుక్ - 51 పోస్టులు
వాషర్ మ్యాన్ - 11 పోస్టులు
అర్హతలు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ (పదో తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి..
కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష, ప్రాక్టికల్ మరియు ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తుది ఎంపిక తర్వాత.. అభ్యర్థులకు రూ. 18 వేల నుండి రూ. 63 వేల 200 వరకు జీతం ఇవ్వబడుతుంది .
ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు..
అభ్యర్థులు ఆఫ్‌లైన్ మోడ్‌లో గ్రూప్ సి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ఫారమ్‌ను పూర్తిగా నింపాలి. దీనిని అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ ఫారమ్ తో పాటు.. అవసరమైన విద్యార్హత సర్టిఫికేట్లను జత చేసిన పోస్టు ద్వారా పంపించాలి. వీటిని గ్రూప్ కమాండర్, C/o 99 APO. HQ 22, మూవ్‌మెంట్ కంట్రోల్ గ్రూప్, పిన్-900328 అడ్రస్ కు మార్చి 3 వ తేదీలో లోపు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫారమ్‌ను సమర్పించే ముందు.. అభ్యర్థులు దరఖాస్తు యొక్క ఎన్వలప్‌పై దరఖాస్తు చేసిన పోస్ట్‌ను తప్పనిసరిగా రాయాలి. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
No comments:
Post a Comment