దేశానికి సేవ చేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇదొక శుభవార్త లాంటిది. ఇండియన్ నేవీ సివిలియన్ పర్సనల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక సైట్ joinindiannavy.gov.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 03న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 28 వరకు అవకాశం ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 249 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు..
ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునే
అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా
తత్సమాన సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల
మధ్య ఉండాలి.
ఎంపిక ఇలా..
ఎంపిక ప్రక్రియలో దరఖాస్తుల స్క్రీనింగ్
తర్వాత రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ తీస్తారు. ఈ
రిక్రూట్‌మెంట్‌కు అర్హులైన అభ్యర్థులు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో కూడిన
రాత పరీక్షకు హాజరు కావాలి. పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.205 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC/ ST/
మాజీ సైనికులు , మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి
మినహాయించబడ్డారు. అభ్యర్థులు దరఖాస్తు రుసుమును నెట్ బ్యాంకింగ్ లేదా వీసా/ మాస్టర్/ రూపే
క్రెడిట్/ డెబిట్ కార్డ్/ UPI ద్వారా చెల్లించవచ్చు. అభ్యర్థులు
నోటిఫికేషన్ లో పేర్కొన్న శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక సైట్ joinindiannavy.gov.in ను సందర్శించొచ్చు.
No comments:
Post a Comment