గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తుంటే.. ప్రైస్‌వాటర్‌హౌజ్‌కూపర్ కంపెనీ మాత్రం భారీగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే ఐదేళ్లలో 30 వేల ఖాళీలు భర్తీ చేయడానికి ఈ కన్సల్టెన్సీ సంస్థ సిద్ధమైంది. దేశంలో కంపెనీ సేవలను విస్తృతపరచడంలో భాగంగా ఉద్యోగాల భర్తీ అనివార్యం కానున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. తద్వారా భారత్‌లో కంపెనీ శ్రామిక సిబ్బంది పెరగనుంది. ప్రస్తుతం దేశంలో కంపెనీలో మొత్తంగా 50వేల మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ శ్రామిక సిబ్బందిని 80వేలకు చేర్చాలన్నది కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
PwC ఇండియా, PwC అమెరికా సంస్థలు సంయుక్తంగా భారత్‌లో కార్యచరణను చేపట్టనున్నాయి. గ్లోబల్ సెంటర్లను భారత్‌లో నెలకొల్పేందుకు జాయింట్ వెంచర్‌లో భాగమయ్యాయి. కంపెనీని విస్తరించడం, నాణ్యతను మెరుగుపరచడం, వృద్ధి సాధించడం, క్లైంట్ సంబంధాలను విస్తృతపరచడమే లక్ష్యంగా ఈ జాయింట్ వెంచర్ కొనసాగనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో భౌగోళికంగా విస్తరించడానికి చాలా ఏళ్ల నుంచి PwC ఇండియా కృషి చేస్తున్నట్లు తెలిపింది. గతేడాది భారత్‌లో నోయిడా, భువనేశ్వర్, జైపుర్‌లలో PwC ఇండియా ఆఫీసులను ప్రారంభించడం ఇందుకు నిదర్శనం.
No comments:
Post a Comment