Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 22 February 2023

తెలంగాణలో 9 వేల జాబ్స్ కు ఎల్లుండే ఇంటర్వ్యూలు.. రూ.లక్ష వరకు జీతం.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..

తెలంగాణలోని కోదాడలో ఈ నెల 25న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో 72 కంపెనీలు పాల్గొని 9 వేలకు పైగా నియామకాలు చేపట్టనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం ప్రైవేటు రంగంలోనూ యువతకు జోరుగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ప్రముఖ సంస్థలు భారీగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ వేలదిగా ఉద్యోగాలను భర్తి చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు, ట్రస్టులు, రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం కేంద్రంలో భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ నేత, కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్ ఛార్జి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ జాబ్ మేళాను ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 72 కంపెనీల్లో 9 వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏఏ విభాగాల్లో అంటే: ఈ జాబ్ మేళా ద్వారా ఐటీ, మెడికల్, మార్కెంటింగ్, మేనేజ్మెంట్, హోటల్స్, ఇండస్ట్రీలు, బీపీఓ, డేటా ఎంట్రీ, నర్సింగ్, ఫార్మా రంగాల్లో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. 

విద్యార్హతలు:

7, 10, ఇంటర్, గ్రాడ్యుయేట్, ఐటీఐ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీఏ, బీఎస్సీ, బీకాం, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్ తదితర విద్యార్హతలు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. మూగ, చెవిటి, దివ్యాంగులు కూడా అప్లై చేసుకోవచ్చు. 
వేతనం: ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్-https://docs.google.com/forms/d/e/1FAIpQLScDxcbMzMfR72rpDhHCV6tUHEF8V39Ca-51ICRz6inGfeHDCQ/viewform

4 comments:

Job Alerts and Study Materials