ఎల్ఐసీ దేశవ్యాప్తంగా 9,394 అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (Apprentice Development Officer) పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు 3 రోజుల్లో ముగుస్తుంది.
ఎల్ఐసీ అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు 2023 ఫిబ్రవరి 10 లోగా అప్లై చేయాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 2023 మార్చి 4న కాల్‌లెటర్స్ విడుదలవుతాయి. 2023 మార్చి 12న ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. 2023 ఏప్రిల్ 8న మెయిన్స్ ఉంటుంది. ఏదైనా డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 2023 జనవరి 1 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. దరఖాస్తూ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment