కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్త్వ శాఖలు, విభాగాల్లో భారీగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. 2021 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుతవంలోని 78 మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో మొత్తం 9. 78 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ఈ మొత్తం ఖాళీల్లో అత్యధికంగా రైల్వే శాఖలో 2.93 లక్షల ఖాళీలు ఉన్నాయి. మరో ముఖ్యమైన రక్షణ శాఖలో 2.64 లక్షల ఖాళీలు ఉన్నాయి. హోం శాఖలో 1.43 లక్షల ఖాళీలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇంకా పోస్టల్ శాఖలో 90050 ఖాళీలు, రెవెన్యూ శాఖలో 80243 ఖాళీలు ఉన్నాయి. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో 25,934 ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ రాజ్యసభలో ప్రశ్న అడగగా.. కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. రానున్న ఏడాదిలో పది లక్షల మంది యువతకు అవకాశాలు కల్పించనుందని చెప్పారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతోన్న రోజ్ గార్ మేళా యువతకు వివిధ శాఖల్లో ఉపాధి, స్వయం ఉపాధి కల్పించడానికి దోహదపడుతోందన్నారు. వేగంగా ఉద్యోగాల భర్తీకి జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నియామకాల్లో ఉత్తమ విధానం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్వంలో పని చేస్తున్న వివిధ నియామక సంస్థలను సమగ్రంగా అధ్యాయనం చేసినట్లు చెప్పారు.
No comments:
Post a Comment