Mother Tongue

Read it Mother Tongue

Monday, 6 February 2023

టీఎస్పీఎస్సీ అలర్ట్.. మరో నోటిఫికేషన్ దరఖాస్తులకు ఎడిట్ అవకాశం..

ఇటీవల టీఎస్పీఎస్సీ ద్వారా 22 హార్టికల్చర్ ఆఫీసర్(Horticulture Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విసయం తెలిసిందే. జనవరి 03 నుంచి ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 24 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. అయితే ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులని దృష్టిలో పెట్టుకొని టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల్లో తప్పులు దొర్లిన అభ్యర్థులు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ తాజాగా వెబ్ నోట్ విడుదల చేసింది. ఈ వెబ్ నోట్ లో ఫిబ్రవరి 08, 2023 నుంచి ఫిబ్రవరి 10, 2023 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ల ఎడిట్ కు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ.1,27,310 జీతం చెల్లించనున్నారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials