విధివిధానాల మార్పుకు సంబంధించి వివిధ దినపత్రికల్లో ఆర్మీ ప్రకటనలు ఇస్తోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి మధ్య నాటికి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఈరోజు (శనివారం) సంబంధిత అధికారవర్గాలు తెలిపాయి. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కీలక మార్పులను ప్రకటించింది. అగ్నివీర్ భారతి ఆధ్వర్యంలో సైన్యంలో చేరాలనుకునే అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CEE)కి హాజరు కావాలని.. దాని తర్వాతనే ఫిజికల్ టెస్టులను నిర్వహించనున్నట్లు పేర్కొంది. అంటే.. దీని తర్వాత శారీరక, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. విధివిధానాల మార్పుకు సంబంధించి వివిధ దినపత్రికల్లో ఆర్మీ ప్రకటనలు ఇస్తోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి మధ్య నాటికి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఈరోజు (శనివారం) సంబంధిత అధికారవర్గాలు తెలిపాయి.
మొదటి పరీక్ష ఏప్రిల్‌లో జరగనుంది
మొదటి ఆన్‌లైన్
కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ)ని ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు
ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు . ఈ ప్రవేశ పరీక్ష దేశవ్యాప్తంగా 200
కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రిక్రూట్‌మెంట్
సమయంలో దరఖాస్తులు చేసుకున్న అందరికీ.. ఫిజికల్ పరీక్షలను
నిర్వహించాలంటే.. కాస్త ఇబ్బందికరమైన అంశం. వాటికి ఎక్కువ రోజులు కేటాయించాల్సి వస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ ప్రతిపాదన
ముందుకు రావడంతో.. అర్హత సాధించిన వారికి మాత్రమే పరీక్షలు
నిర్వహించనున్నారు. దీంతో చాలామంది ఫిల్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఇప్పటివరకు అభ్యర్థులు ఫిజికల్
ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అయిన తర్వాత.. ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్
టెస్ట్ (CEE)కి హాజరు కావాలి. అయితే ఇప్పుడు ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష తొలి అడుగు కానుంది.
2023-24 తదుపరి రిక్రూట్‌మెంట్‌పై ఆసక్తి ఉన్న దాదాపు 40,000 మంది
అభ్యర్థులకు ఈ కొత్త ప్రక్రియ వర్తిస్తుందని కూడా వర్గాలు తెలిపాయి.
No comments:
Post a Comment