Mother Tongue

Read it Mother Tongue

Sunday, 5 February 2023

పది , ఇంటర్, డిగ్రీ అర్హతతో.. ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు..

ఎయిర్ పోస్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 166 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూతో ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖాళీగా గల వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 166 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ , డిగ్రీ అర్హతతో కూడా పోస్టులను కేటాయించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి లాంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 11 పోస్టులు, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 25 పోస్టులు, యుటిలిటీ ఏజెంట్ & ర్యాంప్ డ్రైవర్ – 07 పోస్టులు, అప్రెంటిస్ – 45 పోస్టులు, అప్రెంటిస్ – 36 పోస్టులు..అప్రెంటిస్ (క్లీనర్) – 20 పోస్టులు, డ్యూటీ ఆఫీసర్ – 06 పోస్టులు, జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ – 04 పోస్టులు, జూనియర్ ఆఫీసర్ ప్యాసింజర్ – 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC, ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితి ఉంది. జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు రూ 500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. చెల్లింపు విధానం డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. ఎంపిక విధానం ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.17,520ల నుంచి రూ.32,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు http://www.aiasl.in/ సందర్శించొచ్చు.

1 comment:

  1. Thankyou for your kind information and services 🙏

    ReplyDelete

Job Alerts and Study Materials