Mother Tongue

Read it Mother Tongue

Friday, 17 February 2023

సెక్రటేరియల్ ఎబిలిటీస్ ప్రాక్టీస్ ప్రశ్నలు

 

1) రాజు, త్రైమాసిక పరీక్షలో 56 మార్కులు సగటును సాధించాడు. ఒకవేళ గణితంలో 76 మార్కులు బదులు 100 మార్కులు సాధించినట్లయితే, అతని సగటు 59 మార్కులు అయి ఉండేది. ప్రతి సబ్జెక్టుకు గరిష్టంగా 100 మార్కులు ఉన్నట్లయితే ఆ పరీక్షలో మొత్తం ఎన్ని సబ్జెక్టులు కలవు?

1. 4

2. 6

3. 10

4. 8

2)  a : b = 3 : 7 మరియు b : c = 4 : 7 అయిన a : c = ?

1. 12: 49

2. 28: 21

3. 21: 28

4. 49 : 12

3).రెండు సంఖ్యలు 2 : 3 నిష్పత్తిలో కలవు. ఆ రెండు సంఖ్యలకు 6 చొప్పున కలిపినచో వాటి నిష్పత్తి 3 : 4 అయినచో వాటిలో చిన్న సంఖ్య ఏది?

1. 18

2. 12

3. 24

4. 16

4) రెఫ్రిజిరేటర్ మరియు ఎయిర్ కండిషనర్ ధరలు 5 : 8 నిష్పత్తిలో కలవు. ఒకవేళ ఎయిర్ కండిషనర్ ధర రెఫ్రిజిరేటర్ ధర కంటే రూ.15,000 /- అధికం అయినచో రెఫ్రిజిరేటర్ ధర ఎంత?

1. రూ. 25,000/-

3. రూ. 30,000/-

2. రూ.40,000/- 

4. రూ. 35,000/-

5) రవి ఒక పాత TV ని రూ.6,200/- లకు కొని దాచి రిపేర్ కోసం రూ. 800/- ఖర్చు చేశాడు. ఒకవేళ ఆ TV ని రూ. 8,050/-లకు అమ్మినచో, ఈ లావాదేవీలో అతని లాభశాతం

ఎంత?

1. 1.5

2. 25

3. 15

4. 10

6) ఒక వస్తువును రూ.72.25కు అమ్ముట వలన ఒక వ్యాపారికి 15% నష్టం వచ్చినది. ఆ వస్తువును ఎంతకు అమ్మినచో 20% లాభం వచ్చును?

1. రూ. 100/-

2. రూ. 96/-

3. రూ. 98/-

4. రూ. 102/-

7) ఒక వస్తువును కొంత ధరకు అమ్ముట వలన ఆ దుకాణదారుకు 15% లాభం వచ్చినది. ఒకవేళ ఆ వస్తువును రెండింతలు ధరకు అమ్మినచో అతని లాభశాతం ఎంత?

1. 130

2. 30

3. 120

4. 100

8) ఒక వ్యాపారంలో A, B మరియు C అనే భాగస్తులు క్రమంగా | 2 : 3 : 4 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. ఒక వేళ B యొక్క లాభ వాటా రూ. 45,000/- అయినచో ఆ భాగస్తులు సంపాదించిన మొత్తం లాభం ఎంత?

1. రూ. 1,50,000/-

2. రూ. 1,35,000/-

3. రూ .1,20,000/-

4. రూ. 1,60,000/-

9) A, B మరియు C అనే భాగస్తులలో, A యొక్క పెట్టుబడి B యొక్క పెట్టుబడిలో సగం మరియు B యొక్క పెట్టుబడి C యొక్క పెట్టుబడిలో సగం అయినచో, వారికి వచ్చిన మొత్తం లాభం రూ. 2,45,000/- లో C యొక్క భాగం ఎంత?

 1. రూ. 35,000/- 

2. రూ. 70,000/- 

3. రూ. 1,05,000/- 

4. రూ. 1,40,000/-

10) P మరియు Q లు భాగస్తులు. P తన పెట్టుబడి రూ. 24,000/-లను 8 నెలల పాటు మరియు Q తన పెట్టుబడి మొత్తాన్ని 4 నెలల పాటు ఉంచారు. ఒకవేళ Q యెక్క లాభ భాగం 3/7 అయినచో అతని యెక్క పెట్టుబడి ఎంత?

1. రూ.1,44,000/-

2. రూ.72,000/-

3. రూ.78,000/-

4. రూ.36,000/-

11) దిగువ రెండు ప్రకటనలు ఇవ్వబడినవి మరియు ఆ తరువాత రెండు నిర్ణయాలు ఎ, బి లు కూడా ఇవ్వబడినవి. ఏ నిర్ణయము (లు) ఇచ్చిన ప్రకటనలననుసరించి ఉన్నాయో సరైన సమాధానంతో గుర్తించండి?

ప్రకటన

1. కొన్ని ఈగలు చీమలు

2. అన్ని కీటకాలు చీమలు

నిర్ణయం :

ఎ. అన్ని ఈగలు చీమలు

బి. కొన్ని చీమలు కీటకాలు

1. నిర్ణయం ఎ మాత్రమే అనుసరిస్తుంది.

2. నిర్ణయం బి మాత్రమే అనుసరిస్తుంది 3. ఎ, బిలు రెండూ అనుసరిస్తాయి

4. ఎ కానీ బి కానీ అనుసరించదు

12) దిగువ రెండు ప్రకటనలు ఇవ్వబడినవి మరియు ఆ తరువాత రెండు నిర్ణయాలు ఎ, బి లు కూడా ఇవ్వబడినవి. ఏ నిర్ణయము (లు) ఇచ్చిన ప్రకటనలననుసరించి ఉన్నాయో సరైన సమాధానంతో గుర్తించండి?

ప్రకటన : 1. అన్ని చొక్కాలు స్తంభాలు

2. ఏ స్తంభము తలుపు కాదు

నిర్ణయం :

ఎ. కొన్ని చొక్కాలు తలుపులు

బి. కొన్ని తలుపులు స్తంభాలు

1. నిర్ణయం ఎ మాత్రమే అనుసరిస్తుంది

2. నిర్ణయం బి మాత్రమే అనుసరిస్తుంది 

3. ఎ, బిలు రెండూ అనుసరిస్తాయి

4. ఎ కానీ బి కానీ అనుసరించదు

13) దిగువ ప్రకటనను గమనించాక, ఆ తరువాత నీయబడిన వాదనలు ఎ మరియు బిలని చదివి, సరైన సమాధానాన్ని గుర్తించ

ప్రకటన : చెట్ల నరికివేతను నిషేధించాలా?

వాదన :

ఎ. ఔను, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుటకు

బి. కాదు, కలప ఆధారిత పరిశ్రమలపై ప్రభా వితం చూపుతుంది.

1. వాదన ఎ మాత్రమే బలమైనది

2. వాదన బి మాత్రమే బలమైనది

3. వాదన ఎ, బిలు రెండూ బలమైనవి

4. వాదన ఎ కానీ, బి కానీ బలమైనది కాదు

14) దిగువ ప్రకటనను గమనించాక, ఆ తరువాత నీయబడిన వాదనలు ఎ మరియు బిలని చదివి, సరైన సమాధానాన్ని

గుర్తించండి?

ప్రకటన :

భారత రైల్వేలలో ఆవిరి ఇంజన్ల స్థానంలో విద్యుత్తు ఇంజన్లు మార్చాలా?

వాదన : ఎ. కాదు. ఇండియాలో విద్యుత్ ఉత్పత్తి సరి

పోయినంత లేదు.

బి. ఔను, ఆవిరి ఇంజన్లు కాలుష్య కారకాలు

1. వాదన ఎ మాత్రమే బలమైనది

2. వాదన బి మాత్రమే బలమైనది

3. వాదన ఎ, బిలు రెండూ బలమైనవి

4. వాదన ఎ కానీ, బి కానీ బలమైనది కాదు

15) దిగువ ప్రకటనను గమనించాక, ఆ తరువాత నీయబడిన ఉ వాదనలు ఎ మరియు బి లని చదివి, సరైన సమాధానాన్ని

గుర్తించండి? 

ప్రకటన : ఇండియా రక్షణ దళాలు కలిగి ఉండనవసరం లేదా? 

వాదన : ఎ. కాదు, ఇతర దేశాలు అహింసను పాటించవు.

బి.  ఔను, చాలా మంది భారతీయులు అహింస ను విశ్వసించి, పాటిస్తారు.

1. వాదన ఎ మాత్రమే బలమైనది.

2. వాదన బి మాత్రమే బలమైనది.

3. వాదన ఎ, బిలు రెండూ బలమైనవి

4. వాదన ఎ కానీ, బి కానీ బలమైనది కాదు

16) దిగువ ప్రకటనను గమనించాక, ఆ తరువాత నీయబడిన వాదనలు ఎ మరియు బిలని చదివి, సరైన సమాధానాన్ని

గుర్తించండి?

ప్రకటన : చట్టబద్ధంగా కట్నం నిషేధించినప్పటికీ, కట్నం తీసుకునే పెళ్లి కొడుకుల్ని శిక్షించాలా?

వాదన : ఎ. కాదు. ఎప్పటి నుంచో, ఈ వ్యవస్థ కొన సాగుతోంది.

బి. ఔను, చట్టాన్ని అతిక్రమించుతున్నారు కాబట్టి శిక్షార్హులే.

1. వాదన ఎ మాత్రమే బలమైనది

2. వాదన బి మాత్రమే బలమైనది.

3. . వాదన ఎ, బిలు రెండూ బలమైనవి

4. వాదన ఎ కానీ, బి కానీ బలమైనది కాదు

17) దిగువ ప్రకటనను గమనించాక, ఆ తరువాత నీయబడిన వాదనలు ఎ మరియు బిలని చదివి, సరైన సమాధానాన్ని గుర్తించండి?

ప్రకటన : ఇండియాలో చిన్న పిల్లలందరికీ విద్యను తప్పనిసరిగా చేయాలా?

వాదన : ఎ. ఔను. అది వెంటనే జీవన ప్రమాణాల్ని మెరుగుపరుస్తారు.

బి. ఔను. ఇది బాలకార్మికుల్ని తగ్గిస్తుంది.

1. వాదన ఎ మాత్రమే బలమైనది

2. వాదన బి మాత్రమే బలమైనది

3. వాదన ఎ, బిలు రెండూ బలమైనవి

4. వాదన ఎ కానీ, బి కానీ బలమైనది కాదు

18) దిగువ ప్రకటనను గమనించాక, ఆ తరువాత నీయబడిన య వాదనలు ఎ మరియు బిలని చదివి, సరైన సమాధానాన్ని గుర్తించండి?

ప్రకటన : పరిశ్రమలలో ఎత్తయిన పొగ గొట్టాల్ని ఏర్పరచాలా? 

వాదన : ఎ. ఔను. భూతలంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చు.

బి. కాదు. అది పరిశ్రమల ఖర్చును పెంచుతుంది.

1. వాదన ఎ మాత్రమే బలమైనది

2. వాదన బి మాత్రమే బలమైనది

3. వాదన ఎ, బిలు రెండూ బలమైనవి

4. వాదన ఎ కానీ, బి కానీ బలమైనది కాదు

19) దిగువ రెండు ప్రకటనలు ఇవ్వబడినవి మరియు ఆ తరువాత రెండు నిర్ణయాలు ఎ, బిలు కూడా ఇవ్వబడినవి. ఏ నిర్ణయము (లు) ఇచ్చిన ప్రకటనలననుసరించి ఉన్నాయో సరైన సమాధానం తో గుర్తించండి?

ప్రకటన :

ఒక సర్వే ప్రకారం, ప్రతి దినము 30 నిమిషా

లకు తగ్గకుండా భౌతిక వ్యాయామం చేసే వాళ్లు గుండె సంబంధిత వ్యాధులకు తక్కువగా గురువుతారు.

నిర్ణయం : ఎ. ఒక మోతాదులో భౌతిక వ్యాయామం, ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అవసరం.

బి. ఆఫీస్ డెస్క్ ఉద్యోగం చేసే వ్యక్తులు అందరూ గుండె సంబంధిత వ్యాధులకు గురవుతారు.

1. నిర్ణయం ఎ మాత్రమే అనుసరిస్తుంది

2. నిర్ణయం బి మాత్రమే అనుసరిస్తుంది

3. నిర్ణయం ఎ, బిలు రెండూ అనుసరిస్తాయి

4. నిర్ణయం ఎ మాత్రమే అనుసరిస్తుంది

20) దిగువ రెండు ప్రకటనలు ఇవ్వబడినవి మరియు ఆ తరువాత రెండు నిర్ణయాలు ఎ, బిలు కూడా ఇవ్వబడినవి. ఏ నిర్ణయము (లు) ఇచ్చిన ప్రకటనలననుసరించి ఉన్నాయో సరైన సమాధానం తో గుర్తించండి?

ప్రకటన :

నిర్ణయం :

ఈ ప్రపంచం మంచిది కాదు, చెడుది కాదు. ప్రతి వ్యక్తి తనకు తానే తన ప్రపంచాన్ని తయారు చేసుకుంటాడు.

ఎ. కొందరు వ్యక్తులు ఈ ప్రపంచం బాగుంది

అనుకుంటారు.

బి. కొందరు వ్యక్తులు ఈ ప్రపంచం బాగా లేదు

అని అనుకుంటారు.

1. నిర్ణయం ఎ మాత్రమే అనుసరిస్తుంది.

2. నిర్ణయం బి మాత్రమే అనుసరిస్తుంది. 

3. నిర్ణయం ఎ, బిలు రెండూ అనుసరిస్తాయి.

4. నిర్ణయం ఎ కానీ బి కానీ అనుసరించదు

21) దిగువ రెండు ప్రకటనలు ఇవ్వబడినవి మరియు ఆ తరువాత రెండు నిర్ణయాలు ఎ, బిలు కూడా ఇవ్వబడినవి. ఏ నిర్ణయము (లు) ఇచ్చిన ప్రకటనలననుసరించి ఉన్నాయో సరైన సమాధానం తో గుర్తించండి?

ప్రకటన : భారత రాజకీయాలలో ధనం ముఖ్యమైన మరియు ప్రభావవంతమైన పాత్ర వహిస్తుంది. 

నిర్ణయం : ఎ. పేద వారు రాజకీయ నాయకులు కాలేరు.

బి. అందరు ధనవంతులు రాజకీయాలలో

చేరుతారు.

1. నిర్ణయం ఎ మాత్రమే అనుసరిస్తుంది 

2. నిర్ణయం బి మాత్రమే అనుసరిస్తుంది 

3. నిర్ణయం ఎ, బిలు రెండూ అనుసరిస్తాయి 

4. నిర్ణయం ఎ కానీ బి కానీ అనుసరించదు

 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials