Mother Tongue

Read it Mother Tongue

Monday, 6 February 2023

తెలంగాణ బడ్జెట్ ప్రసంగంలో.. 11 వేల ఉద్యోగాలపై మంత్రి కీలక ప్రకటన..

నేడు(February 06) తెలంగాణ బడ్జెట్ ను మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టారు. 2.90లక్షల కోట్లకు పైగా ఈ బడ్జెట్ ను కేటాయించారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించనున్నట్లు అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు ప్రకటించారు. వచ్చే రెండు నెలల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రసంగంలో ప్రకటించారు. అంటే.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్దీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటి నుంచో తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యూలర్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ల డిమాండ్ ను ప్రభుత్వం బడ్జెట్‌ ప్రసంగంలో చేర్చింది. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను ఏప్రిల్ నుంచి క్రమబద్దీకరించనున్నట్లు ప్రకటించారు. అంటే.. తెలంగాణ వ్యాప్తంగా 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయనున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం ఉద్యోగులదే అని ఆర్థిక మంత్రి అన్నారు. దేశంలో అత్యధిక వేతనాలను తెలంగాణలో పొందుతున్నారని చెప్పారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా.. ఆశా, అంగన్ వాడీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వడం, ఏక కాలంలో అందరికి వర్తింప చేసినట్లు చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు కొత్త ఈహెచ్‌ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వామ్యుల్ని చేసే విధంగా.. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ట్రస్ట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. 2014 జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రత్యక్ష నియామకాల ద్వారా తెలంగాణలో 1,61,572 ఉద్యోగాలను భర్తీకి అనుమతించామని వాటిలో 1,41,735 ఉద్యోగాలకు ఎంపికలు పూర్తైనట్లు చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని .. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అయినట్లు తెలిపారు. వీటితో దాదాపు 65 వేలకు పైగా ఖాళీలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభించాయని అన్నారు. ఇక మిగిలిన పోస్టులకు కూడా త్వరలో ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వనుందని పేర్కొన్నారు. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials