ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 19న జరగనున్న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లను పోలీస్ నియామక మండలి (SLPRB AP) విడుదల చేసింది. ఫిబ్రవరి 15 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. 19 వ తేదీన ఉదయం పది గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు షిఫ్ట్ – 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు షిఫ్ట్ – 2 పరీక్షలు జరగుతాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా
411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీస్ రిక్రూట్‌మెంట్
బోర్డు ప్రకటన ఇవ్వగా.. మొత్తం 1,73,047 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో
పోస్టుకు 421 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 1,40,453
మంది పురుషులు దరఖాస్తు చేయగా.. 32,594 మంది మహిళలు ఉన్నారు.
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ ఇదే.. క్లిక్ చేయండి
No comments:
Post a Comment