Mother Tongue

Read it Mother Tongue

Saturday, 4 February 2023

12,523 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది. అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. వీటిలో రీజియన్ల వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు.. ఇక హవాల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా.. 529 హవాల్దార్ పోస్టులున్నాయి.

మ‌ల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నిక‌ల్‌) స్టాఫ్ ఎగ్జామినేషన్ - 2022

  • మొత్తం ఖాళీల సంఖ్య: 12,523
  • మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 11,994 పోస్టులు
  • హవాల్దార్ (సీబీఐసీ, సీబీఎన్): 529 పోస్టులు (హైదరాబాద్-8)
ముఖ్య సమాచారం:
  • అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
  • వయోపరిమితి: 01.01.2023 నాటికి 18-25 సంవ‌త్సరాల మధ్య ఉండాలి. 02.01.1998 - 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. కొన్ని పోస్టులకు 18-27 సంవ‌త్సరాల మధ్య ఉండాలి. 02.01.1996 - 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
  • దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 18, 2023.
  • దరఖాస్తుకు చివరితేది: ఫిబ్రవరి 17, 2023
  • ఫీజు చెల్లించడానికి చివరితేది: ఫిబ్రవరి 19, 2023
  • ఆఫ్‌లైన్ చలనా జనరేట్ చేసుకోవడానికి చివరితేది: ఫిబ్రవరి, 19, 2023
  • చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: ఫిబ్రవరి 20, 2023
  • దరఖాస్తుల సవరణకు అవకాశం: ఫిబ్రవరి 23, 24
  • కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష తేది: ఏప్రిల్, 2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://ssc.nic.in/

No comments:

Post a Comment

Job Alerts and Study Materials