హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఇంటెలిజెన్స్ బ్యూరో(Intelligence Bureau) ఇటీవల పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనవరి 21 నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉండగా.. దానిని 2023 జనవరి 28 వరకు పొడిగించారు. జనవరి 28 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను mha.gov.in సందర్శించాలని పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. వైద్యపరంగా, శారీరకంగా దృఢంగా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దీనితో పాటు.. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అతడికి ఎలాంటి నేర చరిత్రను కలిగి ఉండకూడదు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1675 పోస్టులను భర్తీ చేస్తారు. దీని కింద.. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్ వంటి పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. సెక్యూరిటీ అసిస్టెంట్ 1525 పోస్టులుండగా.. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు 150 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లుగా నిర్ణయించారు.
మూడు దశల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదట రాత పరీక్ష నిర్వహించబడుతుంది. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరవుతారు. ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను స్కిల్ టెస్ట్‌కు పిలుస్తారు. తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 17 ఫిబ్రవరి 2023గా పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 21 ఫిబ్రవరి 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు తెలంగాణలో 46, విజయవాడలో 05 పోస్టులను కేటాయించారు. ఎంటీఎస్ పోస్టుల్లో హైదరాబాద్ కు 02, విజయవాడకు 02 పోస్టులు కేటాయించారు.
No comments:
Post a Comment