Mother Tongue

Read it Mother Tongue

Saturday, 4 February 2023

కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో 405 పోస్టులకు దరఖాస్తులు..

బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కోల్‌ మైనింగ్ లో పని చేయుటకు 405 మైనింగ్ సిర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తులు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత  సాధించి ఉండాలి. మైనింగ్ సిర్దార్ షిప్ సర్టిఫికెట్‌/ఫస్ట్‌ ఎయిడ్‌ అండ్‌ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్/సర్వే సర్టిఫికేట్/సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల యొక్క వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఫిబ్రవరి 23, 2023వ తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జనరల్ , బీసీ అభ్యర్ధులు రూ.1180లు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/వికలాంగ/మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.31,852ల వరకు జీతంగా చెల్లిస్తారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials