దీని కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ద్వారా ఆన్ లైన్ లో సవరించుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పరీక్షను జూన్ లేదా జులై 2023లో నిర్వహించనున్నారు. 27 సబ్జెక్టుల్లో.. మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు.
సబ్జెక్టుల వారీగా ఖాళీలు
1. అరబిక్ పోస్టులు: 2
2.బోటనీ - 113
3. బోటనీ (ఉర్దూ మీడియం)-15
4.కెమిస్ట్రీ - 113
5. కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం) - 19
6. సివిక్స్ - 56
7.సివిక్స్ (ఉర్దూ మీడియం) - 16
8. సివిక్స్ (మారాఠీ) - 01
9. కామర్స్ - 50
10. కామర్స్ (ఉర్దూ మీడియం) - 07
11. ఎకనామిక్స్ - 81
12. ఎకనామిక్స్ (ఉర్దూ) - 15
13. ఇంగ్లీష్ - 81
14.ఫ్రెంచ్ - 02
15. హిందీ - 117
16. హిస్టరీ- 77
17. హిస్టరీ (ఉర్దూ మీడియం) - 17
18. హిస్టరీ (మరీఠీ మీడియం) - 01
19. మ్యాథ్స్ - 154
20. మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) - 09
21. ఫిజిక్స్ - 112
22. ఫిజిక్స్(ఉర్దూ మీడియం) - 18
23. సాంస్క్రీట్(Sanskrit) - 10
24. తెలుగు - 60
25. ఉర్దూ - 28
26. జువాలజీ - 128
27. జువాలజీ (ఉర్దూ మీడియం) - 18
పరీక్షవిధానం ఇలా..
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో ఉంటుంది. పేపర్-2 ఇంగ్లిష్లో మాత్రమే ఉంటుంది. అయితే పేపర్ 2ని కూడా తెలుగు మీడియంలో నిర్వహించాలని తెలుగు మీడియంలో చదువుకున్న అభ్యర్థులకు కోరుతున్నారు.
No comments:
Post a Comment