Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 14 February 2023

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

 

సింగరేణిలో పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 11 విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.

సింగరేణిలో పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 11 విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22, 2023 దరఖాస్తులకు చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వీటికి ఎలాంటి రాత పరీక్ష ఉండదని.. కేవలం ఇటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న ఉదయం 9.30 గంటలకు SCCL హెడ్ ఆఫీస్, కొత్తగూడెం నందు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.25లక్షల జీతం ఇవ్వపడుతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 64 ఏళ్లకు మించకూడదని పేర్కొన్నారు. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ అండ్ సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విభాగాల వారీగా ఖాళీల విషయానికి వస్తే.. అనస్థీషియా 02, చెస్ట్ ఫిజీషియన్ 01, ఈఎన్టీ సర్జన్ 02, ఆప్త్మాలజిస్ట్ 03, పిడియాట్రీషియన్ 02, రేడియోలజిస్ట్ 01, జనరల్ సర్జన్ 02, గైనకాలజిస్ట్ 04, హెల్త్ ఆఫీసర్ 03, ఆర్థో సర్జన్ 02, ఫిజీషియన్ 04 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 26 పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి వివరాలకు www.scclmines.com వెబ్ సైట్ ను సందర్శించాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండీ పేర్కొన్నారు. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials