Mother Tongue

Read it Mother Tongue

Monday, 13 February 2023

పది, డిగ్రీ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు..

ఆదాయపు పన్ను శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆదాయపు పన్ను శాఖ ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ మరియు టాక్స్ అసిస్టెంట్ వంటి అనేక పోస్టుల ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులెవరైనా అధికారిక వెబ్‌సైట్ www.incometaxbengaluru.orgలో అందుబాటులో ఉన్న రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఫారమ్‌ను పూరించి పంపాలి. ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. వివరాలను నింపాలి. దీనితో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్లను జత చేయాలి. ఇలా.. అభ్యర్థులు తమ దరఖాస్తును 'కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (అడ్మినిస్ట్రేషన్ & TPS), ఇన్‌కమ్ టాక్స్ డివిజన్ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్, కర్ణాటక మరియు గోవా రీజియన్, సెంట్రల్ రెవెన్యూ బిల్డింగ్, నం. 1, క్వీన్స్ రోడ్, బెంగళూరు, కర్ణాటక 560001'కి పంపాలి.

ఖాళీల వివరాలు..

మొత్తం పోస్టులు – 71

 ఇన్‌కమ్ ఇన్‌స్పెక్టర్ - 10 పోస్టులు

టాక్స్ అసిస్టెంట్ - 32 పోస్టులు

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 29 పోస్టులు

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ - 6 ఫిబ్రవరి 2023

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ - 24 మార్చి 2023

అర్హతలు..

ట్యాక్స్ అసిస్టెంట్ మరియు ఇన్‌స్పెక్టర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వీటిని స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్నారు.

వయో పరిమితి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం..

ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ 7 ప్రకారం రూ.44,900 నుండి రూ.1,42,400 వరకు చెల్లించబడుతుంది. మరోవైపు, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ 4 ప్రకారం రూ.25,500 నుండి 81,100 వరకు చెల్లించబడుతుంది. లెవెల్ 1 ప్రకారం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 18,000 నుండి 56,900 వరకు చెల్లించబడుతుంది. 

1 comment:

Job Alerts and Study Materials