Mother Tongue

Read it Mother Tongue

Monday, 13 February 2023

TS-APలో 3746 పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తులకు రెండు రోజుల సమయం..

ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ పలు జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ పలు జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 23 పోస్టల్ సర్కిళ్లల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది. పై చదువులు లేకున్నా.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతిలో గణితం, ఆంగ్లం తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి సెకండరీ తరగతి వరకు స్థానిక భాషను అభ్యసించి ఉండటం కూడా అవసరం. ఇదిలా ఉండగా.. 40వేలకు పైగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో తెలంగాణలో సర్కిల్ లో 1266, ఏపీ సర్కిల్ లో 2480 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి దరఖాస్తులు చేసుకునే అభ్యర్థి పదో తరగతి పూర్తి చేస్తే సరిపోతుంది. అయితే పదిలో వచ్చిన మెరిట్ స్కోర్ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థికి ఈ ఉద్యోగం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీటికి ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక సైట్ లో అప్ లోడ్ చేస్తారు. దీనిలో మీ పేరు ఉంటే.. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. ఆ తర్వాత జాయినింగ్ లెటర్ ను మీ ఇంటికి పంపిస్తారు. నోటిఫికేషన్ , ఆన్ లైన్ అప్లికేషన్ల కొరకు https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి. వయోపరిమితి విషయానికొస్తే.. ఈ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీకి వయో సడలింపు ఉంటుంది. ఈ దరఖాస్తులు 16 ఫిబ్రవరి 2023 వరకు అందుబాటులో ఉంటాయి. అంటే.. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 16. ఈ అప్లికేషన్‌ల ఎండిట్ ఆప్షన్ ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 19, 2023 వరకు ఉంటుంది. దరఖాస్తులకు మరో రెండు రోజులు సమయం మాత్రమే ఉంది.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials