Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 14 February 2023

ఏపీలో ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్‌.. పూర్తి వివరాలివే

 

ఆంధ్రప్రదేశ్ - మంగళగిరిలోని ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ .. ఔట్‌సోర్సింగ్ విధానంలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. ఫిబ్రవరి 23 దరఖాస్తులకు చివరితేది. వివరాల్లోకెళ్తే..

ముఖ్య సమాచారం:
  • ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు: 10 పోస్టులు
  • విభాగాలు: ఫిజిక్స్- 03 పోస్టులు, కెమిస్ట్రీ- 02 పోస్టులు, బయాలజీ- 05.
  • అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఎస్సీ డిగ్రీ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
  • వయోపరిమితి: 01.07.2022 నాటికి 34 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
  • జీతభత్యాలు: నెలకు రూ.20,000.
  • ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, రాతపరీక్ష, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో విద్యార్హతలకు 20 మార్కులు, రాతపరీక్షకు 50 మార్కులు, పని అనుభవానికి 20 మార్కులు, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు.
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోబొరేటరీ, నాలుగో అంతస్తు, టెక్ టవర్, మంగళగిరి, గుంటూరు.
  • దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 23.02.2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://citizen.appolice.gov.in/

No comments:

Post a Comment

Job Alerts and Study Materials