Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 14 February 2023

Hyderabad GHMC పరిధిలో 1500 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న ప్రభుత్వం

 

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ పరిధిలో మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలకానుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. త్వరలోనే మేడ్చల్‌ జిల్లాకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తామని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. క్రమంగా అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు బస్తీ దవాఖానల్లో కోటి మంది ప్రజలు సేవలు పొందారని వెల్లడించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. పేదల సౌకర్యం కోసం బస్తీ దవాఖానల పని దినాల్లో మార్పు చేస్తామన్నారు. ఇకపై శనివారం సెలవు ఇస్తున్నామని.. ఆదివారం పనిచేయనున్నాయని తెలిపారు. బస్తీ దవాఖానల్లో ఉచితంగా లిపిడ్‌ ప్రొఫైల్‌, థైరాయిడ్‌ వంటి ఖరీదైన పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. మార్చి నెలాఖరు నాటికి 134 రకాల పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ దవాఖానలతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లపై ఓపీ భారం తగ్గిందని చెప్పారు. ఏప్రిల్‌లో అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్‌ కిట్లు పంపిణీ చేస్తామన్నారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials