ఇప్పటికే తెలంగాణ హైకోర్టు(Telangana High Court) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను వెల్లడించిన విషయం తెలిసిందే. తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఖాళీ పోస్టులకు, హైకోర్టులో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లకు వెల్లడించింది. దీనిలో అసిస్టెంట్(Assistant), ఆఫీస్ సబార్డినేట్, ఎగ్జామినర్ తదితర పోస్టులు ఇందులో ఉన్నాయి. ఇక తాజాగా తెలంగాణ బడ్జెట్ లో(Budget) మరో 1721 పోస్టులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో కోర్టులను, న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పరిచినట్లు మంత్రి తెలిపారు. నిర్వహణకు కొత్తగా సిబ్బంది అవసరం అవుతారని.. దానిలో భాగంగానే 1721 పోస్టులను మంజూరు చేసినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులను(Court) ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ కోర్టు భవనాలు నిర్మించుకోవడానికి రూ.1050 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
1. ఆఫీస్ సబార్డినేట్ : 50 పోస్టులు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి పాసైనా.. ఫెయిల్ అయినా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ.. పది తర్వాత హైయర్ స్టడీ చేసి ఉండకూడదు.
2. అసిస్టెంట్ : 10 పోస్టులు
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లా) ఉత్తీర్ణులై ఉండాలి.
3. ఎగ్జామినర్ : 17 పోస్టులు
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లా) ఉత్తీర్ణులై ఉండాలి.
4. సిస్టమ్ అసిస్టెంట్ : 45 పోస్టులు
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ(ఈసీఈ/సీఎస్ఈ/ఐటీ) పూర్తి ఉండాలి. లేదా డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఐటీ ఉన్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
5. అప్పర్ డివిజన్ స్టెనో: 2 పోస్టులు
ఏదైనా డిగ్రీతోపాటు టైపింగ్(హయ్యర్‌గ్రేడ్), షార్ట్‌హ్యాండ్ సర్టిఫికేట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ డిగ్రీ/డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
6. అసిస్టెంట్ లైబ్రేరియన్: 2 పోస్టులు
లా డిగ్రీతోపాటు బీఎల్ఐఎస్సీ డిగ్రీ ఉండాలి. ఎంఎల్ఐఎస్సీ ఉన్నవారికి ప్రాధాన్యం. లైబ్రరీ నిర్వహణకు సంబంధించి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి.
7. కంప్యూటర్ ఆపరేటర్: 20 పోస్టులు
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లా) ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు.. టైపింగ్ రైటింగ్(హయ్యర్ గ్రేడ్) పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి. ఏడాది పీజీడిప్లొమా-కంప్యూటర్ ప్రోగ్రామింగ్/కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు చేసి ఉండాలి. లేదా బీసీఏ డిగ్రీ కలిగి ఉండాలి.
8. ట్రాన్స్‌లేటర్ పోస్టులు సంఖ్య: 10
దీనిలో తెలుగు ట్రాన్స్‌లేటర్ పోస్టులు 08, ఉర్దూ ట్రాన్స్‌లేటర్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. వీటికి మూడేళ్లు లేదా ఐదేళ్ల లా డిగ్రీ ఉండాలి. తెలుగు ట్రాన్స్‌లేటర్ పోస్టులకు తెలుగు నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి తెలుగులోని ట్రాన్స్ లేషన్ చేయగలగాలి. అదేవిధంగా ఉర్దూ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు ఉర్దూ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి ఉర్దూలోని అనువాదం చేయగలగాలి.
9. కోర్టు మాస్టర్స్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శి ఖాళీల సంఖ్య: 20
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లా) ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు.. ప్రభుత్వం నిర్వహించే టైపింగ్ టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వం నిర్వహించే టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ (ఇంగ్లిష్- నిమిషానికి 45 పదాలు) పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
Good information sir
ReplyDelete