Mother Tongue

Read it Mother Tongue

Sunday, 5 February 2023

అభ్యర్థులకు అలర్ట్.. పదో తరగతి అర్హతతో హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు..

తెలంగాణలో టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచే కాకుండా.. ఇతర నియమామక సంస్థల నుంచి అనేక ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. వీటిలో భాగంగానే.. తెలంగాణ హైకోర్టు నుంచి కూడా వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.. దీనిలో డ్రైవర్ పోస్టులు(Driver Posts) కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు జనవరి 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 06, 2023 ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవన్నీ జనరల్ కేటగిరీ విభాగంలో భర్తీ చేయనున్నారు.

అర్హతలు..

పదో తరగతి అర్హతగా పేర్కొన్నారు. దీని కంటే ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తలు చేసుకోవచ్చు. వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. డ్రైవింగ్ లో మూడేళ్ల అనుభవం కూడా ఉండాలని పేర్కొన్నారు.

వయస్సు :

18 -34 ఏళ్లుగా పేర్కొన్నారు. దీనిలో రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఇచ్చారు.

ఎంపిక ప్రక్రియ ఇలా..

స్కిల్ టెస్ట్ (డ్రైవింగ్ -40 మార్కులు), 10 మార్కులు వైవా(ఇంటర్వ్యూ) ఉంటుంది.

దరఖాస్తు ఫీజు రూ. 500 డీడీ తీసి.. అప్లికేషన్ ఫారమ్ తో దానిని జత చేసి.. "to the Registrar (Recruitment), High Court for the State of Telangana at Hyderabad 500 066 " అడ్రస్ కు కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపాలి.

డ్రైవర్ పోస్టులే కాకుండా హైకోర్టులోని పలు ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా మొత్తం 176 పోస్టులను భర్తీ చేయనున్నారు.  హైకోర్టు సబార్డినేట్ -50, సిస్టమ్ అసిస్టెంట్- 45, కంప్యూటర్ ఆపరేటర్లు - 20 , కోర్టు మాస్టర్లు/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శులు -20, ఎగ్జామినర్లు - 17, ట్రాన్స్లేటర్లు – 10, అసిస్టెంట్లు - 10, UD స్టెనోలు - 02, అసిస్టెంట్ లైబ్రేరియన్లు - 02 ఖాళీగా ఉన్నాయి. వీటికి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తుల చేయాలి. వీటిదరఖాస్తులలకు చివరి తేదీ ఫిబ్రవరి 11, 2023. అభ్యర్థుల యొక్క వయస్సు 18 – 34 సంవత్సరాల మద్య ఉండాలి . మార్చిలో పరీక్షలు ఉంటాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను https://tshc.gov.in/ సందర్శించాలి. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials