దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్(KVS)లో పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్(Notification) జారీ అయింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 13 వేలకు పైగా ఫోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ వంటి టీచింగ్, నాన్ టీచింగ్(Non Teaching) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. KVS రిక్రూట్‌మెంట్ పరీక్ష 2022 షెడ్యూల్‌ను ఇటీవల విడుదల చేసింది. KVSలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా షెడ్యూల్‌ను తనిఖీ చేయవచ్చు. దీనికి సంబంధించి KVS యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను kvsangathan.nic.in సందర్శించాలి. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 13 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తారు.
ఇదిలా ఉండగా.. KVS రిక్రూట్‌మెంట్ పరీక్ష 07 ఫిబ్రవరి 2023 నుండి ప్రారంభమవుతుంది. 06 మార్చి 2023 వరకు కొనసాగుతుంది. 07 ఫిబ్రవరి 2023న అసిస్టెంట్ కమీషనర్ పోస్టుకు పరీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 08న ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 09 న, వైస్ ప్రిన్సిపాల్ మరియు PRT (సంగీతం) పోస్టులకు పరీక్ష ఉంటుంది. అయితే ఈ మూడు కేటగిరీలకు సంబంధించి తాజాగా అధికారులు అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ లింక్ ను యాక్టివేట్ చేశారు. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరుగుతుంది. పీఆర్టీ మ్యూజిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక్ ఇచ్చి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అసిస్టెంట్ కమీషనర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ లింక్ ద్వారా హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment