
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) విద్యాదాన్ స్కాలర్‌షిప్స్ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్‌షిప్స్ (LIC HFL Vidyadhan Scholarship) ద్వారా టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారికి ఆర్థికంగా ప్రోత్సాహకం లభిస్తుంది. ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు చదవలేని విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్ పొందొచ్చు. టెన్త్ పాసైన విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువు కోసం స్కాలర్‌షిప్ పొందొచ్చు. మరి టెన్త్ పాసైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఎలాంటి అర్హతలు ఉండాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి. టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఈ స్కాలర్‌షిప్ కోసం అప్లై చేయొచ్చు. పదో తరగతిలో 60 శాతం లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం ఏటా రూ.3,60,000 లోపు ఉండాలి. బాలికలకు, దివ్యాంగులకు, తల్లిదండ్రులు లేని వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్‌షిప్ ద్వారా ఇంటర్మీడియట్ చదివేవారికి ప్రతీ ఏటా రూ.15,000 చొప్పున స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇలా రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్ పొందొచ్చు. ఈ స్కాలర్‌షిప్ పొందడానికి ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ , టెన్త్ మార్క్స్ షీట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్ తీసుకున్నట్టు ప్రూఫ్, అకడమిక్ ఇయర్ ఫీజ్ రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాలి. Buddy4Study పోర్టల్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్‌షిప్ దరఖాస్తు విధానం
- అభ్యర్థులు Buddy4Study పోర్టల్ ఓపెన్ చేయాలి.
- అందులో LIC HFL Vidyadhan Scholarship 2023 లింక్ పైన క్లిక్ చేయాలి.
- అందులో టెన్త్ పాస్ అయినవారికి ఇచ్చే స్కాలర్‌షిప్ లింక్ పైన క్లిక్ చేయాలి.
- విద్యార్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
- స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment