సమాజంలో వెనుకబడిన వర్గాల వారికి ఉన్నత విద్యను చేరువ చేస్తున్నాయి వివిధ రకాల స్కాలర్‌షిప్స్. ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్‌కు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ ఫర్ వైబ్రెంట్ ఇండియా (PM YASASVI) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎగ్జామ్‌లో సాధించిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ఈ స్కీమ్ కింద స్టైఫండ్ అందిస్తోంది. అయితే పీఎం యశస్వి స్కాలర్‌షిప్ కోసం నిర్వహించే ఎగ్జామ్ సెప్టెంబర్ 29న జరగాల్సి ఉండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా రద్దు చేసింది. ఈసారి పీఎం యశస్వి స్కాలర్‌షిప్‌ను అకడమిక్స్‌లో మెరిట్ ఆధారంగా మంజూరు చేయనున్నట్లు తెలిపింది.
అకడమిక్ మెరిట్ ఆధారంగానే..
పీఎం యశస్వి స్కాలర్‌షిప్‌లను అందించడానికి 8, 10 తరగతుల మార్కులను ఆధారంగా చేసుకోనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. 8, 10 తరగతుల్లో 60 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించిన అభ్యర్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. ఈ పోర్టల్ ద్వారానే విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ స్కాలర్‌షిప్ కోసం నిర్వహిస్తున్న పరీక్షతో విద్యార్థులపై అదనపు భారం పడుతోందని, అందుకే ఎగ్జామ్‌ను క్యాన్సిల్ చేసి మెరిట్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని అధికారులు వెల్లడించారు.
వీరికి ప్రత్యేకం..
ప్రైమ్ మినిస్టర్ యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా పథకాన్ని వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, డీనోటిఫైడ్ ట్రైబ్స్ వర్గాలకు చెందిన పిల్లల కోసం ప్రారంభించారు. సుమారు 30,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఈ స్కీమ్ కోసం ఎవరు అర్హులు..?
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక అవ్వాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించి ఉండకూడదు. ఈ పథకం కింద ఎంపికైన వారికి 9, 10 తరగతిలో సంవత్సరానికి రూ.75 వేల వరకు స్కాలర్‌షిప్ అందిస్తారు. అలాగే 11, 12 తరగతి విద్యార్థులు సంవత్సరానికి రూ. 1.25 లక్షల స్కాలర్‌షిప్ అందుకోనున్నారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రస్తుత సంవత్సరానికి స్కాలర్‌షిప్ మంజూరు చేయడం లేదు. మరిన్ని వివరాల కోసం, విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ లేదా సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
ఎలా అప్లై చేయాలి..?
విద్యార్థులు పీఎం యశస్వి యోజన అధికారిక వెబ్‌సైట్ yet.nta.ac.inలో అప్లై చేసుకోవచ్చు. పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత, హోమ్ పేజీలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు డిస్‌ప్లే అవుతాయి.
ముఖ్యమైన లింక్స్
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
24/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
27/09/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
27/09/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
20/09/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
26/09/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
25/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment